తొలి పోరుకు రెఢీ
మొదటి విడత ఎలక్షన్ సమాచారం
2,872 పీఓ,ఓపీఓలు..
బరిలో..
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వివరాలు
నేటి ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్
జనగామ: స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. కొద్ది గంటల్లో ప్రారంభం కానున్న ఎన్నికల వేళ రాత్రి గ్రామాల్లో డబ్బుల వర్షం కురిసింది. అభ్యర్థులు ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.3వేల వరకు పంపిణీ చేస్తూ..వెండి నాణేలు, గిఫ్ట్ ప్యాకెట్లతో ఓటర్లను ఆకర్శించే ప్రయత్నం చేశారు. కొన్ని గ్రామాల్లో తెల్లవారుజాము 3 గంటల నుంచే ఇంటింటికీ తిరిగి చక్రం తిప్పారు. 200 ఓటర్లకు ఒక క్లస్టర్‌గా విభజించి నమ్మకమైన వారికే క్యాష్ పంపిణీ చేసే బాధ్యతలు అప్పగించారు. మరోవైపు మద్యం ఏరులై పారించారు. కొంతమంది ఓటర్లు మాత్రం డబ్బు, గిఫ్టులను తిరస్కరించారు. డబ్బు రాజకీయాలతో పోలింగ్ ముందే వేడిపెరిపోగా, పోలీసులు సమస్యాత్మక గ్రామాలపై నిఘా పెంచారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అల్లర్లకు పాల్పడే వారికి ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. పోలింగ్ ప్రారంభానికి ముందే ఓటరు లెక్కలు మార్చేందుకు సాగిన రాత్రి డ్రామా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాగా పోలింగ్ కేంద్రాల్లో భద్రత కోసం భారీ బందోబస్తు చేపట్టనున్నారు. 59 క్రిటికల్ కేంద్రాల్లో ప్రత్యేక నిఘా వేయనున్నారు. ఐదు మండలాల్లో 1.72 లక్షల ఓటర్లు గురువారం ఎవరి భవితవ్యం తేలుస్తారో వేచి చూడాలి.
స్టేషన్‌ఘనన్‌పూర్ నియోజకవర్గ పరిధిలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు యంత్రాంగం సిద్ధమైంది. లింగాలఘణపురం, రఘునాథపల్లి, స్టేషన్‌ఘన్‌న్‌పూర్, జఫర్‌గఢ్, చిల్పూరు మండలాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా, సాయంత్రం 4 గంటలకు ఉపసర్పంచ్ ఎన్నికలు ప్రార ంభిస్తారు. 1,024 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన ఎన్నికల యంత్రాంగం, ఈసారి ఓటర్ల సౌకర్యం, భద్రత, నిష్పాక్షికతపై ప్రత్యేక దృష్టి పెట్టింది. 100 ఓట్ల వరకు 266, 101–200 ఓట్ల మధ్య 413, 201–400 ఓట్ల వరకు 345 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 72 మంది మైక్రో అబ్జర్వర్లు, 36 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ చేపట్టనున్నారు. అదనంగా 42 జోన్లలో 112 రూట్లను ఏర్పాటు చేసి, 59 కేంద్రాలను క్రిటికల్‌గా గుర్తించారు. ఇదిలా ఉండగా ఐదు మండలాల పరిధిలో 5 డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి 72 బస్సుల్లో పోలింగ్ కేంద్రాలకు అఽధికారులు, సిబ్బంది, ఎన్నికల సామగ్రిని పోలీసు ఎస్కార్ట్ నడుమ తరలించారు.
ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పోలీసు శాఖ పరంగా వెస్ట్‌జోన్ పరిధిలోని 166 పంచాయతీల్లో 108 సాధారణ, 58 క్రిటికల్ గ్రామాలుగా గుర్తించారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్ పర్యవేక్షణలో ఇద్దరు అడిషనల్ డీసీపీలు, ఏడుగురు ఏసీపీలు, 14మంది సీఐలు, 100మంది ఎస్‌ఐలు, 1,500 మంది ఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్, ఆర్ముడ్ ఫోర్స్ సిబ్బంది బందోబస్తులో ఉంటారు. గత ఎన్నికల్లో అల్లర్లకు పాల్పడిన వారిని ముందుగానే పోలీసులు హెచ్చరించారు. ఓటింగ్, కౌంటింగ్ తర్వాత గెలుపు, ఓటముల నేపథ్యంలో ఏ సంఘటనలు జరగకుండా భారీ ఏర్పాట్లు చేశారు. గ్రామాల్లో పోలింగ్ కోసం సిద్ధం చేశారు.
లింగాలఘణపురంలో బ్యాలెట్ బాక్సులతో సిబ్బంది
మధ్యాహ్నం 2 గంటల నుంచి
కౌంటింగ్, విజేతల ప్రకటన
సాయంత్రం 4 గంటలకు
ఉప సర్పంచ్ ఎన్నిక
ఎన్నికల్లో గెలుపు కోసం డబ్బులు,
మద్యం ఎర
ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు
అభ్యర్థుల చివరి యత్నాలు
గ్రామ పంచాయతీలు : 110
వార్డులు : 1,024
మొత్తం ఓట్లు : 1,72,506
పురుషులు : 85,180
మహిళలు : 87,322
ఇతరులు : 8
మైక్రో అబ్జర్వర్లు : 72
వెబ్ కాస్టింగ్ : 36
పోలింగ్ నిర్వహణలో 1,131 మంది పీఓలు, 1,544 మంది ఓపీఓలు, 10శాతం అదనపు సిబ్బందితో కలిపి మొత్తం 2,872 మంది పనిచేయనున్నారు. స్టేజ్ –2 ఆర్వో ఆధ్వర్యంలో మొత్తం ప్రక్రియ ముందుకు సాగనుంది. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల లోపల ఎవరూ చేరకుండా కఠిన ఆదేశాలు జారీ చేశారు.
మొదటి విడతలో 110 పంచాయతీలు, 1,024 వార్డులు, ఎలక్షన్లు జరుగుతుండగా, ఇప్పటికే 10 మంది సర్పంచులు, 228 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 341 మంది సర్పంచులు, 784 మంది వార్డు సభ్యులు బరిలో ఉండడంతో పోటీ ఉత్కంఠ భరితంగా మారింది.
ఉదయం 7 గంటల మధ్యాహ్నం 1 గంట
వరకు పోలింగ్
మధ్యాహ్నం 2 గంటలకు లెక్కింపు
సాయంత్రం 4 గంటలకు
ఉప సర్పంచ్ ఎన్నిక
స్టేషన్‌ఘన్‌పూర్ : 97
చిల్పూరు : 39
జఫర్‌గడ్ : 94
రఘునాథపల్లి : 142
లింగాలఘనపురం : 62
మొత్తం : 434
తొలి పోరుకు రెఢీ
తొలి పోరుకు రెఢీ


