అప్రమత్తంగా ఉండాలి
చిల్పూరు: స్థానిక ఎన్నికల కౌంటింగ్ పూర్తి అయ్యే వరకు పోలీసులు, పోలింగ్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీపీ సన్‌ప్రీత్‌సీంగ్ సూచించారు. మండల కేంద్రంలో బుధవారం పోలింగ్ సామగ్రి తరలింపు ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏసీపీ భీంశర్మ, ఎస్సై సిరిపురం నవీన్‌కుమార్ తదితరులు ఉన్నారు.
దేవరుప్పుల/ పాలకుర్తి టౌన్: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు అని వార్యమని గ్రామ పంచాయతీ ఎన్నికల వ్యయ జిల్లా పరిశీలకురాలు జయశ్రీ అన్నారు. బుధవారం దేవరుప్పుల, పాలకుర్తి మండలాల్లో ఆ మె సర్పంచ్, వార్డు సభ్యులకు ప్రవర్తన నియామావళి అవగాహన సమావేశం నిర్వహించారు. వేర్వేరు సమావేశాల్లో జిల్లా సహాయ ఎన్నికల అధికారి మేనక పౌడేల్, పాలకుర్తి ఎంపీడీఓ వేదవతి, తహసీల్దార్లు ఆడెపు అండాలు, స్వర్ణలత, ఎన్నికల వ్యయం మండల పరిశీలకులు ఉమాశంకర్, ఎస్సైలు ఊర సృజన్‌కుమార్, పవన్‌కుమార్ పాల్గొన్నారు.
రఘునాథపల్లి: పంచాయతీ ఎన్నికల సందర్భ ంగా మండలంలో బుధవారం రాత్రి గ్రామాల్లో ప్రలోభ పర్వం ఊపందుకుంది. ప్రత్యర్థి ఎంత పంచుతున్నారో తెలుసుకొని అంతకంటే ఎక్కు వ ఇచ్చి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ముందే నగదు, మద్యం పంపిణీ ప్రారంభిస్తే అవతలి వ్యక్తి అంతకన్నా ఎక్కువ ఇచ్చే అవకాశం ఉందనే భావనతో మెజార్టీ అభ్యర్థులు వేచి చూసే ధోరణి ప్రదర్శించారు. ఎదుటి వ్యక్తి రూ.1000 ఇస్తే రూ.1500, ప్రత్యర్థి రూ.1500 పంచుతున్నాడని తెలిస్తే రూ.2000 నగదు ఓటర్లకు ఇచ్చేందుకు పోటీ పడ్డారు.
జనగామ రూరల్: విద్యార్థులు రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కె. సందీప అన్నారు. జిల్లా న్యాయసేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ ఆదేశాల మేరకు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కళాశాలలో హ్యూమన్ రైట్స్ మానవ హక్కులపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి విద్యార్థులకు రాజ్యాంగంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో నరసింహులు, రవికుమార్, జి.మనోజ్ కుమార్ పాల్గొన్నారు.
జనగామ: జనగామ మాతృదర్శన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దివంగత ప్రొఫెసర్ వెదిరె మధుసూదన్‌రెడ్డి వర్ధంతి పురస్కరించుకుని బుధవారం క్రీడాపోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో జిల్లాలోని వివిధ గ్రామాలు, కళాశాలలు నుంచి దాదాపు 500 మందికి పైగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నట్లు మాతృదర్శన్ ట్రస్ట్ అధ్యక్షుడు నిడిగొండ చంద్రశేఖర్ తెలిపారు. బాల, బాలికలకు వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, 2 కిలోమీటర్ల ట్రాక్ ఈవెంట్, షాట్‌పుట్, లాంగ్‌జంప్, మ్యూజికల్ చైర్, ముగ్గుల పోటీల్లో ఎవరికి వారే సత్తా చాటుకున్నారు. కార్యక్ర మానికి ముఖ్య అతిథులుగా జిల్లా స్పోర్ట్స్ అండ్ యూత్ ఆఫీసర్, కోఆర్డినేటర్ కోదండరాములు, ప్రముఖ రచయిత్రి కీర్తి పతాకారెడ్డి హాజరయ్యారు. అనంతరం విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో నీల, ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ చలామయిరెడ్డి, కోచ్ రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
అప్రమత్తంగా ఉండాలి
అప్రమత్తంగా ఉండాలి
అప్రమత్తంగా ఉండాలి


