ఎన్నికల విధుల్లో జాగ్రత్తగా ఉండాలి
● ఎన్నికల పరిశీలకుడు రవికిరణ్,
కలెక్టర్ రిజ్వాన్ బాషా
స్టేషన్‌ఘన్‌పూర్: మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది జాగ్రత్తగా వ్యవహరించాలని ఎన్నికల పరిశీలకుడు రవికిరణ్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. గురువారం నిర్వహించనున్న పోలింగ్‌ను పురస్కరించుకుని మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలలో విధులు నిర్వహించనున్న ఎన్నికల అధికారులు, పీఓలు, ఏపీఓలు, ఎన్నికల సిబ్బందికి ఘన్‌పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలలో బుధవారం ఎన్నికల సామగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోలింగ్ మెటీరియల్ పంపిణీ సెంటర్‌ను ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. కార్యక్రమంలో ఆర్‌డీఓ డీఎస్ వెంకన్న, ఎంపీడీఓ నర్సింగరావు, తహసీల్దార్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
బాధ్యతగా వ్యవహరించాలి..
రఘునాథపల్లి: ఎన్నికల విధులు భాద్యతగా నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్‌బాషా అధికారులకు సూచించారు. బుధవారం రఘునాథపల్లి ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న మొదటి విడత పంచాయతీ ఎన్నికల సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఎంపీడీఓ గార్లపాటి శ్రీనివాసులు, తహసీల్దార్ ఫణికిషోర్, పంచాయతీ కార్యదర్శి బాలకిషన్, పీఓ, ఏపీఓలు ఉన్నారు.
గూగుల్ మీట్‌లో సమీక్ష
జనగామ: పోలింగ్, లెక్కింపు ప్రక్రియను అధికార యంత్రాంగం సమన్వయంతో జాగ్రత్తగా నిర్వహించాలని ఎన్నికల పరిశీలకుడు రవి కిరణ్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. మొదటి విడత పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి బుధవారం ఎంపీడీఓ, తహసీల్దార్, ఆర్వోలు, జోనల్ ఆఫీసర్‌లతో గూగుల్ మీట్‌లో సమీక్షించారు.


