నిర్భయంగా ఓటు వేయాలి
● డీసీపీ రాజమహేంద్రనాయక్
స్టేషన్‌ఘన్‌పూర్: ప్రజలందరూ నిర్భయంగా ప్రశాంత వాతావరణంలో ఓటుహక్కును వినియోగించుకోవాలని వెస్ట్‌జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్ అన్నారు. బుధవారం ఇప్పగూడెం గ్రామంలో పోలీసు కవాతు నిర్వహించారు. సీఐ జి.వేణు, రాఘవేందర్, ఎస్‌ఐలు వినయ్, రాజేష్ పాల్గొన్నారు.
కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
రఘునాథపల్లి: ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని డీసీపీ రాజమహేంద్రనాయక్ హెచ్చరించారు. మండల కేంద్రంలో కవాతు నిర్వహించారు. ఏసీపీ భీంశర్మ, సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సై నరేష్ పాల్గొన్నారు.
సిబ్బందికి అవగాహన..
జఫర్‌గఢ్: మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో సిబ్బందికి డీసీపీ రాజమహేంద్రనాయక్ అవగాహన కల్పించారు. ఏసీపీలు నాగరాజు, అంబటి నర్సయ్య, సీఐలు సంతోష్‌కుమార్, శ్రీనివాసరావు, ఎస్సై రామారావు పాల్గొన్నారు.


