మెరుగైన సేవలు అందించాలి
● అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్
జనగామ రూరల్: అధికారులు సమన్వయంతో పనిచేసి పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ అన్నారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో విభాగాల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, ఇంజనీరింగ్ సిబ్బంది, వివిధ లైన్ డిపార్ట్‌మెంట్ అధికారులు పాల్గొన్నారు.
ఎన్నికల నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకోండి
లింగాలఘణపురం: ఎన్నికల నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకొని పొరపాట్లు జరుగకుండా చూసుకోవాలని అధికారులకు అదనపు కలెక్టర్ పింకేశ్‌కుమార్ సూచించారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని సందర్శించారు. ఆయనతో పాటు ఎంపీడీఓ శివశంకర్‌రెడ్డి, తహసీల్దార్ రవీందర్ తదితరులు ఉన్నారు.


