నేడు సీతారాముల కల్యాణం
లింగాలఘణపురం: మండలంలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామి ఆలయంలో 10న జరిగే సీతారాముల కల్యాణోత్సవంలో దేవతల ఆహ్వానం (ధ్వజారోహణం, గరుడముద్ద), ఎదురుకోళ్ల తంతు ఆదివారం రాత్రి పూర్తయింది. వేదపండితులు విజయసారథి, శ్రీనివాసాచార్యులు, భార్గవాచార్యులు, రాఘవాచార్యులు, మురళీధరాచార్యులు రామచంద్రుడు, సీతమ్మవారి పక్షాన పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. వేదమంత్రోచ్ఛరణలు, డోలు వాయిద్యాలతో ఎదురుకోళ్ల తంతును పూర్తి చేసి 10న జరిగే కల్యాణోత్సవానికి సిద్ధం చేశారు. ఆలయ ప్రాంగణమంతా విద్యుత్ వెలుగులతో జిలేల్‌మంటోంది. భక్తుల కోసం తగిన సౌకర్యాలను పూర్తి చేశారు. కల్యాణోత్సవం తిలకించేందుకు ఆదివారం నుంచి భక్తులు విచ్చేస్తున్నారు. కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్ మూర్తి, ఈఓ వంశీ, దేవస్థాన కమిటీ డైరెక్టర్లు, రిటైర్డ్ ఈఓ కేకే రాములు, సిబ్బంది భరత్, మల్లేశం, రమేశ్ తదితరులు తమ సేవలు అందిస్తున్నారు.
పూర్తయిన ఎదురుకోళ్ల తంతు
భక్తులతో కిటకిటలాడుతున్న జీడికల్
నేడు సీతారాముల కల్యాణం
నేడు సీతారాముల కల్యాణం


