పోలీసులు స్నేహపూర్వకంగా మెలగాలి | - | Sakshi
Sakshi News home page

పోలీసులు స్నేహపూర్వకంగా మెలగాలి

Oct 31 2025 7:32 AM | Updated on Oct 31 2025 7:32 AM

పోలీస

పోలీసులు స్నేహపూర్వకంగా మెలగాలి

పోలీసులు స్నేహపూర్వకంగా మెలగాలి ప్రభుత్వ ఆస్పత్రుల సందర్శన పోగొట్టుకున్న చెక్కు అందజేత ‘శాతవాహన’కు స్వాగతం

బచ్చన్నపేట: సమస్యలతో పోలీస్‌స్టేషన్‌కు వచ్చే వారితో పోలీసులు స్నేహపూర్వకంగా మెలగాలని జనగామ ఏఎస్పీ పండేరి చేతన్‌ నితిన్‌ సూచించారు. గురువారం మండలకేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో రికార్డులను పరిశీలించారు. స్టేషన్‌ పరిసరాలను పరిశీలించారు. కార్యక్రమంలో నర్మెట సీఐ అబ్బయ్య, ఎస్సై ఎస్‌కే హమీద్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ నర్సిరెడ్డి, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

జనగామ: జిల్లా ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్‌(డీహెచ్‌)తో పాటు ధర్మకంచ అర్బన్‌ ప్రాథమిక దవాఖానను గురువారం ఇద్దరు ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్లు వెంకటరమణ, తేజస్విని ఆకస్మికంగా సందర్శించారు. డీహెచ్‌లో డాక్టర్లు మధుకర్‌యాదవ్‌, కరుణాకర్‌రాజు, ఆయా విభాగాల వైద్యులు, ధర్మకంచలో డాక్టర్‌ శ్రీతేజ, సూపర్‌వైజర్‌ వి.రమేశ్‌తో కలిసి ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్లు మాట్లాడారు.. ఆస్పత్రిలో అందిస్తున్న సేవలను ప్రత్యక్షంగా చూసి అభినందించారు.

4న జిల్లాస్థాయి యువజన కళాకారుల ఎంపిక

జనగామ రూరల్‌: ఈనెల 31న నిర్వహించాల్సి న జాతీయ యువజనోత్సవాల జిల్లాస్థాయి యువకళాకారుల ఎంపికను భారీ వర్షాల కారణంగా వచ్చే నెల 4వ తేదీకి మార్చినట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి కోదండరాములు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని జూబ్లీ ఫంక్షన్‌ హాల్‌లో ఈ కార్యక్రమం ఉంటుందని, పోటీలో పాల్గొనదలచిన అభ్యర్థులు ఉదయం 9 గంటలకు హాజరుకావాలని కోరారు.

చిల్పూరు ఆలయంలో

శ్రవణా నక్షత్ర హోమం

చిల్పూరు: బుగులు వేంకటేశ్వరస్వామి సన్నిఽ దిలో కార్తీక మాసం పురస్కరించుకుని గురువారం శ్రవణా నక్షత్ర హోమం, మాసకల్యాణాన్ని అర్చకులు రవీందర్‌శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యుల వేదమంత్రాల నడుమ నిర్వహించారు. ఈఓ లక్ష్మిప్రసన్న, చైర్మన్‌ పొట్లపల్లి శ్రీధర్‌రావు ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు చెందిన పేరి లక్ష్మణ్‌రావు–ప్రభావతి భక్తులకు అన్నప్రసాదం వితరణ చేశారు.

జనగామ: జనగామ డిపో బస్సులో ఓ వ్యక్తి విలువైన చెక్కును పోగొట్టుకోగా..ఆర్టీసీ అధికారులకు దానిని అప్పగించి ఓ కండక్టర్‌ తన నిజాయితీ చాటుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. మార్క రమేశ్‌ అనే వ్యక్తి ఈ నెల 29న హన్మకొండ వైపు వెళ్తున్న జనగామ డిపో బస్సులో భువనగిరిలో ఎక్కారు. జనగామలో బస్సు దిగే క్రమంలో తనవద్ద ఉన్న రూ.2.64లక్షల విలువైన చెక్కును అందులోనే మరచిపోయి దిగి వెళ్లిపోయారు. చెక్కు కండక్టర్‌ బి.స్వామిదాస్‌కు దొరకగా, డిపో మేనేజర్‌ స్వాతికి అప్పగించారు. ప్రయాణికుడు రమేశ్‌ను డిపోకు పిలిపించి గురువారం చెక్కు అందించారు. కండక్టర్‌ను డిపో మేనేజర్‌ అభినందించగా, చెక్కును తిరిగి అప్పగించిన ఆర్టీసీ అధికారులకు రమేశ్‌ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డిపో అసిస్టెంటు మేనేజర్‌ హుస్సేన్‌, ఆఫీసు సూపరింటెండెంట్‌ వై.యాదమనిరావు, సెక్యూరిటీ హెడ్‌ కానిస్టేబుల్‌ వి.ప్రభాకర్‌ ఉన్నారు.

జనగామ రూరల్‌: జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్‌లో శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ రైలు గురువారం హాల్టింగ్‌ కాగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్‌ ఆధ్వర్యంలో రైల్వే డ్రైవర్‌కు పూలదండ వేసి శాలువాతో సత్కరించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావుకు పాలాభిషేకం చేశారు. ఈసందర్భంగా జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్‌ మాట్లాడుతూ.. శాతవాహన హాల్టింగ్‌కు కృషి చేసిన రాంచంద్రరావు, కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఉడుగుల రమేశ్‌, మాజీ కౌన్సిలర్‌ మహంకాళి హరిచంద్ర గుప్తా, నాయకులు శివరాజ్‌ యాదవ్‌, కొంతం శ్రీనివాస్‌, కీర్తి నర్సయ్య,ఐలోని అంజిరెడ్డి పాల్గొన్నారు.

పోలీసులు స్నేహపూర్వకంగా మెలగాలి1
1/2

పోలీసులు స్నేహపూర్వకంగా మెలగాలి

పోలీసులు స్నేహపూర్వకంగా మెలగాలి2
2/2

పోలీసులు స్నేహపూర్వకంగా మెలగాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement