అప్రమత్తంగా ఉన్నాం..
జనగామ: మోంథా తుపాను ప్రభావం నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నారని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో హైదరాబాద్ నుంచి గురువారం డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి వీడియో కాన్పరెన్స్‌లో మాట్లాడారు.. కలెక్టరేట్‌లోని వీసీ హాల్ నుంచి అదనపు కలెక్టర్లు పింకేశ్ కుమార్, బెన్ షాలోమ్, డీసీపీ రాజమహేంద్రనాయక్, ఆర్డీవోలు, వ్యవసాయ, విద్యుత్, సివిల్ సప్‌లై తదితర శాఖలకు చెందిన అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ.. లోతట్టు ప్రాంతాల వద్ద అధికారులు అలర్ట్‌గా ఉండాలని, మున్సిపాలిటీ పరిధిలో అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. వర్ష ప్రభావం వల్ల కలిగిన నష్టంపై వివిధ శాఖల అధికారులు క్షుణ్ణంగా క్షేత్రస్థాయి పరిశీలనలు జరిపి వెంటనే నివేదికలను సమర్పించాలన్నారు.
సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో
కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
