జిల్లాలో 183.5 మిల్లీమీటర్ల వర్షపాతం
మోంథా తుపాను ప్రభావంతో జిల్లాలో ఈ నెల29 నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 183.5(18 సెంటీమీర్లు) వర్షపాతం నమోదైంది. ఇందులో పాలకుర్తి మండలం గూడూరులో అత్యధికంగా 294.8 మిల్లీ మీటర్లు కురియగా, జఫర్‌గఢ్‌లో 277.0, చిల్పూరు మండలం మల్కపూర్‌లో 259.0, జనగామ అర్బన్‌లో 225.3, పాలకుర్తిలో 221.3, నర్మెటలో 219.5, స్టేషన్‌ఘన్‌పూర్ మండలం తాటికొండలో 210.0, దేవరుప్పుల మండలం కొడకండ్లలో 204.5, తరి గొప్పులలో 195.3, జఫర్‌గఢ్ మండలం కూనూరులో 165.8, లింగాలఘణపురంలో 161.0, స్టేషన్‌ఘన్‌పూర్‌లో 158.0, రఘునాథపల్లిలో 157.8, దేవరుప్పులలో 153.0, కొడకండ్లలో 148.0, బచ్చన్నపేటలో 144.8, బచ్చన్నపేట మండలం పడమటికేశ్వాపూర్‌లో 125.3, జనగామ మండలం వడ్లకొండలో 123.0, పాలకుర్తి వావిలాలలో అత్యల్పంగా 46 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వా తావరణ శాఖ అధికారులు వెల్లడించారు. చీటకోడూరు రిజర్వాయర్ నాలుగు గేట్ల పరిధిలో సగం మేర పైకి ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
