రైతులను ఆదుకుంటాం..
● పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
పాలకుర్తి టౌన్: తుపాను ప్రభావంతో పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులతో పాటు ఆస్తి నష్టపోయిన వారిని ఆదుకుంటామని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని విస్నూరు, విష్ణుపురం ఎస్సీకాలనీలో భారీ వర్షంతో ఇబ్బందులు పడుతున్న ప్రజల ఇండ్లను పరిశీలించారు. శానిటేషన్, విద్యుత్, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని అధికారులను ఫోన్‌లో అదేశించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి, నివేదిక అందించాలన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
