
లోపాలు లేని బిల్లింగ్ విధానం
ఆటోమేటిక్ మీటర్ రీడింగ్(ఏఎంఆర్) విధానంతో లోపాలు లేని బిల్లింగ్ విధానాన్ని అమలుచేసేందుకు ఇది చక్కగా దోహదపడుతుంది. హెచ్‌టీ విద్యుత్ బిల్లుల జారీలో మాన్యువల్‌తో వచ్చే సమస్యలను అధిగమిస్తాం. సర్కిల్ పరిధిలో అధిక సామర్థ్యం గల విద్యుత్తును పరిశ్రమలకు ముందుగా ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా అన్ని కేటగిరీల పరిధిలో 197 పరిశ్రమలు ఉండగా, నెలవారీ బిల్లుల డిమాండ్ రూ.12కోట్ల మేర ఉంటుంది. ఏఎంఆర్‌తో స్మార్ట్ మీటరింగ్ వ్యస్థత బలోపేతం కానుంది. ఈ విధానాన్ని ఎప్పటికప్పుడు డీఈ, ఏఈలు పర్యవేక్షిస్తారు. పరిశ్రమలు, ఇతర అన్ని వర్గాలకు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయాలనే సంకల్పంతో సంస్థ ముందుకెళ్తోంది. – టి.వేణుమాధవ్, ఎస్‌ఈ, ఎన్‌పీడీసీల్, జనగామ సర్కిల్