పబ్లిక్‌ ప్లీడర్‌గా నక్క సంధ్యారాణి | - | Sakshi
Sakshi News home page

పబ్లిక్‌ ప్లీడర్‌గా నక్క సంధ్యారాణి

Sep 20 2025 7:02 AM | Updated on Sep 20 2025 7:02 AM

పబ్లి

పబ్లిక్‌ ప్లీడర్‌గా నక్క సంధ్యారాణి

జనగామ రూరల్‌: జనగామ ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషనన్స్‌ జెడ్జీస్‌ కోర్టు గవర్నమెంట్‌ ప్లీడర్‌గా జనగామ పట్టణానికి చెందిన నక్క సంధ్యారాణి శుక్రవారం నియమితులయ్యారు. హనుమకొండలోని ఆదర్శ లా కాలేజీలో ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసి 2009నుంచి న్యాయవాద వృత్తిలో రాణిస్తున్నారు. కాగా తన నియామకానికి సహకరించిన పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి, సీఎం ముఖ్యసలహాదారు వేం నరేందర్‌రెడ్డికి సంధ్యారాణి కృతజ్ఞతలు తెలిపారు.

ఉపాధి కల్పించండి సారూ..

తరిగొప్పుల: తన భర్త 7 సంవత్సరాల క్రితం చనిపోయాడని, ఇద్దరు పిల్లలు, ఇంటిపోషణ కష్టంగా ఉందని, తనకు ఉపాధి కల్పించాలని కోరుతూ మండలంలోని అక్కరాజుపల్లి గ్రామానికి చెందిన గోరంతల అన్నపూర్ణ సీఎం ప్రజావాణి ఇన్‌చార్జ్‌, రాష్ట్ర ప్లానింగ్‌ బోర్డ్‌ వైస్‌ చైర్మన్‌ జి.చిన్నారెడ్డిని శుక్రవారం కలసి వినతిపత్రం అందించింది. ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించిన ఆయన పదో తరగతి వరకు చదువుకున్న అన్నపూర్ణకు అంగన్‌వాడీ టీచర్‌గా అవకాశం కల్పించారు. ఇల్లు లేని ఆమెకు డబుల్‌ బెడ్‌రూం ఇల్లు కేటాయించాలని కలెక్టర్‌కు ప్రతిపాదించారు.

బొడ్డెమ్మ..బొడ్డెమ్మా కోల్‌..

దేవరుప్పుల: మండల కేంద్రంలో బొడ్డెమ్మ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. స్థానిక బస్‌స్టేజీ కాలనీలో శుక్రవారం రాత్రి మహిళలు, చిన్నారులు బొడ్డెమ్మను ఘనంగా ఆడారు. బొడ్డెమ్మ విశిష్టతను నేటి యువతులకు తెలియజేసేలా మహిళలు గత వారం నుంచి జానపద నృత్యాలు, కోలాటాలతో వేడుకలు నిర్వహిస్తున్నారు.

రోగుల ఇబ్బందులు

పట్టించుకోరా?

జనగామ రూరల్‌: జిల్లా ఆసుపత్రిలో డెంగీ, మలేరియా వ్యాధులతో రోగులు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకునే నాథుడులేడని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్‌ విమర్శించారు. శుక్రవారం జిల్లా ఆసుపత్రిని సందర్శించి వైద్యసేవలపై రోగులతో మాట్లాడారు.. ఏరియా హాస్పిటల్‌ వ్యాధిగ్రస్తులతో నిండిపోయిందని, బెడ్లు సరిపోక రోగులకు బయట వార్డులోనే వైద్యం చేస్తున్నారని ఆరోపించారు. రోగులకు మెరుగైన చికిత్స అందించి, నాణ్యమైన మందులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి భాగాల నవీన్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు బొమ్మకంటి అనీల్‌, ప్రధాన కార్యదర్శి పెద్దోజు జగదీశ్‌, కేశపురం రవిరాజ్‌, తోకల హరీశ్‌, చంద్రయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.

జానపద కళలను ప్రోత్సహించాలి

దేవరుప్పుల: రాష్ట్రంలోని అన్నిరకాల జానపద కళారంగాలను ఎలాంటి వివక్ష లేకుండా ప్రోత్సహించాలని తెలంగాణ జానపద కళాకారుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు మహాంకాళి శ్రవణ్‌కుమార్‌, వర్కింగ్‌ స్టేట్‌ ప్రెసిడెంట్‌ గడ్డం హిమగిరి(అప్పిరెడ్డిపల్లె) ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్‌లో ఇటీవల నూతనంగా నియమితులైన తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ ఏనుగు నర్సింహరెడ్డిని శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించి పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలపై చైతన్య ప్రదర్శనలకు 15 రోజుల లోపే పారితోషికం, చనిపోయిన ప్రతీ కళాకారుడి కుటుంబానికి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కోరారు. ఆరేగంటి పుల్లారావు, తాండ్ర అంబేడ్కర్‌, అందుగుల శ్రీను, శంకర్‌ పాల్గొన్నారు.

పబ్లిక్‌ ప్లీడర్‌గా నక్క సంధ్యారాణి
1
1/3

పబ్లిక్‌ ప్లీడర్‌గా నక్క సంధ్యారాణి

పబ్లిక్‌ ప్లీడర్‌గా నక్క సంధ్యారాణి
2
2/3

పబ్లిక్‌ ప్లీడర్‌గా నక్క సంధ్యారాణి

పబ్లిక్‌ ప్లీడర్‌గా నక్క సంధ్యారాణి
3
3/3

పబ్లిక్‌ ప్లీడర్‌గా నక్క సంధ్యారాణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement