
సర్వం సిద్ధం
● కలెక్టరేట్ ఆవరణలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
● జాతీయ జెండా ఆవిష్కరించనున్న
ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
జనగామ: జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం పురస్కరించుకుని సర్వం సిద్ధం చేశారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్‌తో కలిసి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాట్లను పర్యవేక్షించి, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వేడుకలకు ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. 9.48గంటలకు వెస్ట్‌జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్ వేదిక ప్రాంగణం చేరుకుంటారు. 9.58 నిమిషాలకు రానున్న విప్ బీర్ల అయిలయ్యకు అదనపు కలెక్టర్లు స్వాగతం పలుకుతారు. 10 గంటలకు విప్ జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం, జాతీయ గీతం ఆలపిస్తారు. 10.02 గంటలకు పోలీసుల గౌరవ వందనం, 10.15 వరకు చీఫ్‌గెస్ట్ ప్రసంగంతో ముగుస్తుంది. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ మాట్లాడుతూ.. కలెక్టరెట్ ప్రాంగణంలో జరిగే ప్రజాపాలన దినోత్సవ వేడుకల నేపథ్యంలో పడక్బందీ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. సమీక్షలో జనగామ ఆర్డీవో గోపిరామ్, మునిసిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, కలెక్టరేట్ ఏవో శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.