
సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయులదే కీలకపాత్ర
జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ లక్ష్మీనర్సింహరావు
కొడకండ్ల: విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్ది సమాజ అభివృద్ధి కీలకపాత్ర పోషించేది ఉపాధ్యాయులేనని జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, మండల ప్రత్యేక అధికారి ఎన్.లక్ష్మీనర్సింహరావు కొని యాడారు. మంగళవారం మండలకేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిఽథిగా హాజరై మాట్లాడారు. మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న 18 మంది, జిల్లా స్థాయిలో ఎంపికై న ఏడుగురు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఎంపీడీఓ నాగశేషాద్రిసూ రి, ఎంఈఓ గ్రేస్‌కేజియారాణి, ప్రిన్సిపాళ్లు దిలీప్‌కుమార్, భానుప్రసాద్, రవీందర్ పాల్గొన్నారు.