
పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత
● అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్
జనగామ రూరల్: పర్యావరణాన్ని సంరక్షించడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ అన్నారు. మంగళవారం ప్రపంచ ఓజోన్ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓజోన్ దినోత్సవ పోస్టర్ ఆవిష్కరించారు. కాగా జిల్లాలో పర్యావరణ పరిరక్షణకు బ్రాండ్ అంబాసిడర్‌గా గౌసియా బేగంను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర హరితదల డైరెక్టర్ ప్రసన్నకుమార్ నియమక పత్రం అందజేశారని గౌసియా బేగంను అదనపు కలెక్టర్ అభినందించారు. డీసీపీ రాజామహేంద్రనాయక్, అర్డీవో గోపిరామ్ పాల్గొన్నారు.
పకడ్బందీగా ప్రశ్నపత్రాల రూపకల్పన
ప్రశ్నపత్రాల రూపకల్పనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్, డీఈఓ పింకేశ్ కుమార్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో ఉమ్మడి పరీక్షల విభాగం ఆధ్వర్యంలో ఎస్‌ఏ–1 ప్రశ్నపత్రాల తయారీతో పాటు ధ్రువీకరణ, నిర్ధారణ అంశాలపై సమావేశం నిర్వహించారు. పరీక్షల కార్యదర్శి ఎ.చంద్రబాను, రామరాజు పాల్గొన్నారు.