సోమేశ్వరాలయంలో వైభవంగా ఆరుద్రోత్సవం | - | Sakshi
Sakshi News home page

సోమేశ్వరాలయంలో వైభవంగా ఆరుద్రోత్సవం

Sep 17 2025 7:35 AM | Updated on Sep 17 2025 7:59 AM

పాలకుర్తి టౌన్‌: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి దేవాలయంలో ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకొని ‘ఆరుద్రోత్సవం’ కార్యక్రమం మేళతాళాలు, అర్చకుల వేదమంత్రోచ్ఛరణల మధ్య మంగళవారం మహావైభవోపేతంగా జరిగింది. పంచ హరతులు, గర్భాలయ దీపోత్సవం నిర్వహించారు. ఆరుద్రోత్సవ కార్యక్రమంలో భక్తులు పాల్గొని కనులారా తిలకించారు. ఆలయ ఈవో సల్వాది మోహన్‌బాబు, ఆలయ ప్రధాన అర్చకుడు దేవగిరి లక్ష్మన్న, అర్చకులు డీవీఆర్‌శర్మ, అనిల్‌కుమార్‌, మత్తగజం నాగరాజు, సూపరింటెండెంట్‌ కొత్తపల్లి వెంకటయ్య, భక్తులు పాల్గొన్నారు.

పట్టాలెక్కిన టీచర్ల సర్దుబాటు

వారం రోజుల్లో ప్రక్రియ పూర్తి

జనగామ: టీచర్ల సర్దుబాటు ప్రక్రియ పట్టాలెక్కింది. టీచర్ల పదోన్నతులతో ఖాళీ అయిన బడులతో పాటు పిల్లల సంఖ్య ఎక్కువగా ఉండి, తక్కువ ఉన్న ఉపాధ్యాయుల స్థానంలో వర్క్‌ అడ్జెస్ట్‌మెంటు చేయాల్సి ఉంటుంది. సుమారు 80 మంది టీచర్ల వరకు సర్దుబాటు జరుగుతుందని అంచనా. ఈ మేరకు ఇటీవల సాక్షిలో ‘పట్టాలెక్కని టీచర్ల సర్దుబాటు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌, డీఈవో పింకేశ్‌ కుమార్‌ మంగళవారం స్పందించారు. సర్దుబాటు ప్రక్రియ ప్రారంభమైందని, వారం రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా ఈసారి జరిగే సర్దుబాటులో ఎలాంటి పైరవీలకు ఆస్కారం లేకుండా పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పారదర్శకంగా ఉండేలా చేయాలని పలు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. సర్దుబాటు జాప్యానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

షూటింగ్‌బాల్‌ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

స్టేషన్‌ఘన్‌పూర్‌: రాష్ట్రస్థాయి షూటింగ్‌బాల్‌ పోటీలకు ఘన్‌పూర్‌ హోలీక్రాస్‌ స్కూల్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థి యాట ఆనంద్‌, చిల్పూరు మండలం రాజవరం జిల్లా పరిషత్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థులు ఎడ్ల సన్నీ, ఎడ్ల సింధు ఎంపికై నట్లు షూటింగ్‌ బాల్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నెపు కుమార్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల ఘన్‌పూర్‌ డివిజన్‌కేంద్రంలో జరిగిన జిల్లాస్థాయి షూటింగ్‌బాల్‌ క్రీడల ఎంపిక పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చిన ముగ్గురిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఈ నెల 22, 23, 24వ తేదీల్లో మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కాగా రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులను షూటింగ్‌బాల్‌ అసోసియేషన్‌ బాధ్యులు, ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు అభినందించారు.

సోమేశ్వరాలయంలో వైభవంగా ఆరుద్రోత్సవం
1
1/3

సోమేశ్వరాలయంలో వైభవంగా ఆరుద్రోత్సవం

సోమేశ్వరాలయంలో వైభవంగా ఆరుద్రోత్సవం
2
2/3

సోమేశ్వరాలయంలో వైభవంగా ఆరుద్రోత్సవం

సోమేశ్వరాలయంలో వైభవంగా ఆరుద్రోత్సవం
3
3/3

సోమేశ్వరాలయంలో వైభవంగా ఆరుద్రోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement