
సేవా కార్యక్రమాలను చేపట్టాలి
బచ్చన్నపేట: ప్రభుత్వ ఆదేశానుసారం మండలంలోని పలు గ్రామాల్లో స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమాలను చేపట్టాలని జిల్లా వ్యవసాయ అధికారి అంబికాసోనీ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో పలువురు అధికా రులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బుధవారం నుంచి అక్టోబర్ 2 వరకు ఈ కార్యక్రమాలను చేపట్టాలన్నా రు. పోషణ్ అభియాన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన రోజువారీ కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఎంపీడీఓ మమతాబాయ్, మండల వ్యవసాయ అధికారి విద్యాకర్‌రెడ్డి, మండల వైద్యాధికారి సృజన, ఎంపీఓ వెంకటమల్లికార్జున్, పలు శాఖల ఏఈలు, కార్యదర్శులు పాల్గొన్నారు.