
క్రీడల్లో రాణించాలి
స్టేషన్‌ఘన్‌పూర్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని స్టేషన్ ఘన్‌పూర్ సీఐ జి.వేణు అన్నారు. జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండలంలోని ఛాగల్లు జెడ్పీఎస్‌ఎస్ ఆవరణలో జిల్లాస్థాయి సబ్‌జూనియర్స్ బాలబాలికల కబడ్జీ జట్ల ఎంపిక పోటీలను ఆదివారం నిర్వహించారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ పోగుల సారంగపాణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపిక పోటీల్లో బాలురు 150 మంది, బాలికలు 120 మంది హాజరు కాగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన సీఐ మాట్లాడుతూ.. కబడ్డీలో రాణించడం ద్వారా ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ జిల్లా చైర్మన్ సారంగపాణి మాట్లాడుతూ.. పోటీలలో ఎంపికై నవారు ఈనెల 25 నుంచి నిజామాబాద్‌లో జరిగే 35వ సబ్ జూనియర్స్ అంతర్‌జిల్లాల పోటీలలో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు వై.కుమార్‌గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి తోటకూరి గట్టయ్య, సహాయ కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఏదునూరి ఉప్పలయ్య, చింతకింది సుధాకర్, భాస్కుల సమ్మయ్య, రాజు, కుమార్, చందర్, ఆంజనేయులు, షఫీర్ పాల్గొన్నారు.
● స్టేషన్ ఘన్‌పూర్ సీఐ జి.వేణు
● ఛాగల్లులో సబ్ జూనియర్స్
జిల్లా బాలబాలికల కబడ్డీ జట్ల ఎంపిక