
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి
● బతుకమ్మకుంటను సందర్శించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
జనగామ: జనగామ నియోజకవర్గాన్ని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మార్నింగ్ వాక్‌లో భాగంగా జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంటలో పురపాలిక కమిషనర్ మహేశ్వర్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు. బతుకమ్మకుంటలో సుందరీకరణ పనులను పరిశీలించారు. వాకింగ్ ట్రాక్, చిల్ట్రన్ పార్కు, సుందరీకరణ పనుల పురోగతి, ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయమై ఆరా తీశారు. వాకర్లతో కాసేపు ముచ్చటించి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పురపాలిక జనరల్ ఫండ్‌తో పాటు ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా సమకూరిన నిధులతో సుందరీకరణ పనులు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వెంట బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు తాళ్ల సురేశ్‌రెడ్డి, నాయకులు గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, ముస్త్యాల దయాకర్, జూకంటి శ్రీశైలం, అనిత, పూర్ని స్వరూప, బిజ్జాల నవీన్‌గుప్తా, మామిడాల రాజు, ఉల్లెంగుల సందీప్, ఉడుగులు నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.