
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
రఘునాథపల్లి: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు పుప్పాల వేణుకుమార్ అధ్యక్షతన జరిగిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ, దివంగత మహాత్మాగాంధీ జన్మదినోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు మండల, బూత్ స్థాయిలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సమావేశంలో బాల్నె శ్రీనివాస్‌గౌడ్, ఐలోని అంజిరెడ్డి, కావటి ముత్యాలు, వల్లాల వెంకటేశ్, కల్పగూరి ప్రభాకర్, వల్లాల ఉపేందర్, దామోదర్‌రెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు చేరువకావాలి..
లింగాలఘణపురం: సేవా పక్షం మండల కార్యశాల కార్యక్రమంలో భాగంగా ప్రతి కార్యకర్త గ్రా మాల్లో సేవ కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు చేరువ కావాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ కోరారు. మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు కె.సంపత్ అధ్యక్షతన ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. జిల్లా ప్రధాన కార్యదర్శి అంజిరెడ్డి, జిల్లా కార్యదర్శి సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్