
దంచికొట్టింది
జనగామ: జిల్లాలో గురువారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండలతో వాతావరణం హీటెక్కి పోగా.. సాయంత్రం 4 గంటల నుంచి ఒక్కసారిగా చల్లబడింది. 5.30 గంటల ప్రాంతంలో ముసురుతో ప్రారంభమైన వాన.. కనీవినీ ఎరగని స్థాయిలో దంచికొట్టింది. దీంతో జిల్లా కేంద్రంలోని హైదరాబాద్‌రోడ్డుతో పాటు జ్యోతినగర్, బాలాజీనగర్, కుర్మవాడ, శ్రీనగర్ కాలనీ రూట్, చమన్ తదితర ఏరియాలను వరద ముంచెత్తింది. చమన్ ఏరియాలో ఆరుబయట ఉంచిన బైక్‌లు సగం వరకు మునిగిపోగా, హైదరాబాద్ రూట్‌లో దుకాణ షట్టర్ల వరకు వరద చేరడంతో వ్యాపారులు ఆందోళన చెందారు. చంపక్‌హిల్స్‌లో పెంబర్తి బైపాస్ నిర్మాణ పనులు పెండింగ్‌లో ఉండడంతో రోడ్డును ముంచేయడంతో వాహనాలు అందులో ఇరుక్కుపోయాయి. సీఐ దామోదర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అక్కడకు వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి, అజారుద్దీన్, ఆవుల శ్రీనివాస్‌రెడ్డి రోడ్డును సందర్శించారు. కాంట్రాక్టర్, ఎన్‌హెచ్ అధికారుల నిర్లక్ష్యంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందన్నారు. గానుగుపహాడ్ బ్రిడ్జి వద్ద భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లాలో రాత్రి 9 గంటల వరకు 40.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలోని బచ్చన్నపేటలో అత్యధికంగా 113.8 మిల్లీమీటర్లు, జనగామలో 94.0 మి.మీ., రఘునాథపల్లిలో 82.8, లింగాలఘణపురంలో 71.8, స్టేషన్‌ఘన్‌పూర్‌లో 69.3, తరిగొప్పులలో 48, జఫర్‌గడ్‌లో 34, పాలకుర్తిలో 26, నర్మెటలో 9.5, దేవరుప్పులలో 9.3, కొడకండ్లలో 5.5 మి.మీ వర్షం కురిసింది.
జిల్లాకేంద్రంలో ఒక్కసారిగా భారీ వర్షం

దంచికొట్టింది

దంచికొట్టింది