మరిన్ని ఫొటోలు 9లో..
జనగామ: తొమ్మిది రోజుల వినాయక ఉత్సవానికి తెరపడింది. వేలాది మంది భక్తులు భక్తిశ్రద్ధలతో గణపయ్యకు వీడ్కోలు పలికారు. జిల్లాలో రెండు రోజుల పాటు జరిగిన నిమజ్జన కార్యక్రమం ఆదివారం తెల్లవారు జాము ముగిసింది. కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశాల మేరకు డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఆధ్వర్యంలో గణనాథులను నిమజ్జనం చేశారు. ప్రధాన రహదారులతో పాటు శోభాయాత్రలు వెళ్లే మార్గాలు, నిమజ్జన ఘాట్ల వద్ద పోలీసులు పికెటింగ్ నిర్వహించారు. లింగాలఘణపురం నెల్లుట్లతో పాటు అన్ని మండలాల పరిధిలోని గ్రామాల్లో నిమజ్జనం సాఫీగా సాగాయి.
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, డీసీపీ
ముగిసిన నిమజ్జనం