
యూరియా కోసం బారులు
ఘన్‌పూర్ పీఏసీఎస్ ఎదుట యూరియా కోసం బారులుదీరిన రైతులు
జనగామ:ఆగ్రోస్ సెంటర్ వద్ద రైతుల బారులు
జనగామ/స్టేషన్‌ఘన్‌పూర్: జనగామ పట్టణం మున్సిపల్, కలెక్టర్‌రేట్ ఏరియాలోని ఆగ్రోస్ సెంటర్లతో పాటు జేకేఎస్ ఫర్టిలైజర్ దుకాణం వద్ద శనివారం రైతులు యూరియా కోసం బారులు దీరారు. టోకెన్ సిస్టం ప్రకారం యూరియా బస్తాలు ఇవ్వగా, పోలీసులు బందోబస్తు చేపట్టారు. అలాగే స్టేషన్‌ఘన్‌పూర్ పీఏసీఎల్‌లో యూరియా బస్తాలు ఇస్తున్నారని తెలుసుకున్న రైతులు తెల్లవారుజాము నుంచే బారులుదీరారు. స్టాక్ ఉన్న వరకే రైతులకు పంపిణీ చేయగా యూరియా దొరకని రైతులు నిరాశతో వెనుదిరిగారు.

యూరియా కోసం బారులు