
హక్కులు సాధించుకుందాం
లింగాలఘణపురం: కల్లుగీత కార్మికుల హక్కుల కోసం పోరాడిన అమరుల స్ఫూర్తితో హక్కులు సాధించుకుందామని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఉప్పలయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటమల్లయ్య పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని సిరిపురంలో అమరుల యాదిలో సామాజిక చైతన్య యాత్రలో భాగంగా గౌడకులస్తులంతా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మహేందర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఈనెల 18వరకు సామాజిక చైతన్య యాత్రలు నిర్వహించనున్నామన్నారు. రాష్ట్ర కమిటీ సభ్యుడు రాజయ్య, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, శంకరయ్య, భాస్కర్, లక్ష్మినారాయణ, రాజు, ఉపేందర్, అనిల్, వెంకటేశ్ పాల్గొన్నారు. కల్లుగీత కార్మికుడు బస్వగాని కుమార్‌కు నివాళి అర్పించారు.