
గంజాయికి వ్యతిరేకంగా పోరాడితే కేసులా?
జనగామ: గంజాయికి యువత బానిసలు కాకుండా ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడితే పోలీసులు అక్రమ కేసులు పెట్టారని టీ జీవీపీ జిల్లా అధ్యక్షుడు గన్ను కార్తీక్, జిల్లా కార్యదర్శి తుంగ కౌశిక్ అన్నారు. నాలుగేళ్లుగా కోర్టు చుట్టూ తిరుగుతున్నామని వాపోయారు. గురువారం వారు జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ 2022లో జనగామ పట్టణంలో విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు జరుగుతున్న నేపథ్యంలో నిర్మూలన కోసం తమ వంతు పోరాటం చేశామన్నారు. పిల్లలను కాపాడేందుకు ఐక్య ఉద్యమాలు చేస్తే పోలీసులు మాత్రం అక్రమ కేసులతో ఇలా కోర్టు చుట్టూ తిరిగేలా చేశారన్నారు. వారితో పాటు పట్టణ అధ్యక్షుడు వెంపటి అజయ్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు సందీప్, ఎంఎస్‌ఎఫ్ ప్రతినిధి అనిల్ ధీరజ్, ప్రశాంత్, అనిల్‌చౌహన్, అఖిల్ ఉన్నారు.
ఐక్య విద్యార్థి సంఘ నాయకుల ఆవేదన