కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ జలజీవన్ ప్రభుత్వ సెక్రటరీ సుమిత్ ఝా
జనగామ: దేశంలో ప్రతీ ఇంటికి తాగునీటిని అందించడంతో పాటు నీటి సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న జలజీవన్ ప్రోగ్రామ్ సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ జలజీవన్ ప్రభుత్వ సెక్రటరీ సుమిత్ ఝా అన్నారు. కేంద్ర జలజీవన్ కార్యక్రమాలపై ప్రభుత్వ సెక్రటరీ సుమిత్ ఝా గురువారం న్యూఢిల్లీ నుంచి దేశంలోని అరుణాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, తెలంగాణలో అమలవుతున్న జలజీవన్ పథకాల తీరుతెన్నులకు సంబంధించి ఆయా రాష్ట్రాల జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు.
ఇందులో హైదరాబాద్ నుంచి పంచాయతీరాజ్ రూరల్ డెవలప్‌మెంట్ కార్యాలయం నుంచి మిషన్ భగీరథ ఇంజనీరింగ్ ఇన్‌చీఫ్ ప్రభాకర్‌రెడ్డి, జనగామ నుంచి జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా పాల్గొన్నారు. ఈసందర్భంగా సుమిత్ ఝా మాట్లాడుతూ జలజీవన్ మిషన్ పరిధిలో తెలంగాణ రాష్ట్రంలో 17 జిల్లాలతో పాటు దేశవ్యాప్తంగా 31 ఉండగా, ఇక్కడ అమలు చేస్తున్న జలజీవన్ మిషన్ పనుల పురోగతికి సంబంధించి కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో కేంద్ర జలజీవన్ మిషన్ కింద అమలవుతున్న కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో మిషన్ భగీరథ కార్యనిర్వాహక ఇంజనీర్ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.
పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం
జనగామ: జనగామ కలెక్టరేట్‌లో గురువారం ఆర్డీవో గోపీరామ్‌తో కలిసి సమాచార కమిషనర్ అయోధ్యరెడ్డి పెండింగ్‌లో ఉన్న సమాచా ర హక్కు చట్టం దరఖాస్తులను పరిశీలించారు. వివిధ శాఖలకు చెందిన 36 దరఖాస్తులను పరిశీలన పూర్తిచేయగా చేయగా, కొన్ని ప్రాసెస్‌లో ఉన్నాయి. కార్యక్రమంలో జిల్లా ఉన్నతా ధికారులు అంబికాసోని, రాణాప్రతాప్, రవీందర్, విక్రమ్‌కుమార్, మాధవిలత ఉన్నారు.
బంజారాలకు మంత్రి పదవి ఇవ్వాలి
జనగామ రూరల్: బంజారా సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు దరావత్ శంకర్‌నాయక్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని విజయ ఫంక్షన్ హాల్‌లో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణలో లక్షల సంఖ్యలో బంజారాలు ఉన్నా, మంత్రిపదవిని కూడా ఇవ్వకపోవడం దురదృష్ట్టకరమన్నారు. జిల్లా ఉపాధ్యక్షులు ధరావత్ భిక్షపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి ధరావత్ రమేశ్, మోహన్, మూడవత్ రాజు తదితరులు పాల్గొన్నారు.