
నేతన్నలను ప్రోత్సహిద్దాం
జనగామ: కులవృత్తినే నమ్ముకుని జీవనం సాగి స్తున్న చేనేత కార్మికులకు అండగా నిలిచేందుకు నేత వస్త్రాలను ధరించి వారిని ప్రోత్సహిద్దామని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా పిలుపునిచ్చారు. జాతీయ చేనే త దినోత్సవం పురస్కరించుకుని గురువారం ము న్సిపల్ కార్యాలయంలో చేనేత, జౌళిశాఖ ఆధ్వర్యంలో పెద్దఎత్తున సంబురాలు నిర్వహించారు. వేడుకలకు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించా రు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..చేనేత రంగం మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపమని, దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తోందన్నారు. భారతీయ చేనేత పరిశ్రమలో పనిచేస్తున్న లక్షలాది కార్మికుల కృషి, నైపుణ్యాలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందన్నారు. నేతన్న బీమా పథ కం ద్వారా రూ.1.20కోట్ల చెక్కును లబ్ధిదారులకు కలెక్టర్ అందించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన పట్టుచీరలు, ఇతర చేనేత వస్త్రాల స్టాల్స్‌ను సందర్శించి పరిశీలించారు. కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకురాలు చౌడేశ్వరి, జిల్లాలోని చేనేత సహకార సంఘాల అధ్యక్షులు, చేనేత కార్మికులు పాల్గొన్నారు.
చేనేత వస్త్రాలు ధరించి వారికి అండగా ఉందాం
దేశ ఆర్థిక వ్యవస్థలో చేనేత కీలకపాత్ర
జాతీయ చేనేత దినోత్సవంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా