రఘునాథపల్లి: అశ్వరావుపల్లి రిజర్వాయర్ కుడి కాలువ కెనాల్ నుంచి ఫత్తేషాపూర్ చెరువును నింపే కాలువను గురువారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు లింగాల జగదీశ్‌చందర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కోళ్ల రవిగౌడ్ పరిశీలించారు. ఈసందర్భంగా రాంబాబు మాట్లాడుతూ.. ట్రైబల్ వెల్ఫేర్ నిధుల నుంచి ఆయా గ్రామస్థుల కోరిక మేరకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి రూ.9 కోట్లు మంజూరు చేయించారన్నారు. ఈ నిధులతో పలు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయించేందుకు అధికారులతో కలిసి ప్రతిపాదనలు పంపించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో భాస్కర్‌రెడ్డి, హయ్యద్ అలీ, విరోజి, కరుణాకర్, సత్యనారాయణ, మోహన్, వెంకటేశ్ పాల్గొన్నారు.
పెండింగ్ బిల్లులు
అందజేయాలి
● పెన్షన్ల సాధన పోరాట సమితి
ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి
చిల్పూరు: రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే అందజేయాలని పెన్షన్ల సాధన పోరాట సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఇనుగాల ఇంద్రసేనారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. కోర్టు ఆదేశాలతో అందరికీ పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని చెప్పి ఒకరిద్దరికి మాత్రమే అందించే ప్రయత్నం చేయవద్దన్నారు. 2024 నుంచి ఉద్యోగ విరమణ పొందిన ప్రతీ ఒక్కరికి అందజేయాలని డిమాండ్ చేశారు.