
ఉత్తమ ఫలితాలు సాధించేలా పనిచేయాలి
జనగామ: ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా అధికారులు, టీచర్లు కష్టపడి పని చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్(ఏసీ), జిల్లా విద్యాశాఖ అధికారి పింకేష్‌కుమార్ అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్‌లో వయోజన విద్యాశాఖ సంచాలకులు ఉషారాణితో కలిసి ఆయన విద్యాశాఖ పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంఈఓలు, కాంప్లెక్స్ హెచ్‌ఎంలు ప్రతీ పాఠశాలను విధిగా పర్యవేక్షణ చేయాలన్నారు. ఎప్పటికప్పుడు విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలన చేస్తూ ఉత్తమంగా తీర్చిదిద్దాలన్నారు. పాఠశాలలో తాగునీరు, విద్యుత్తు, మరుగుదొడ్ల సౌకర్యాలకు ప్రాధాన్యం కల్పించామన్నారు. మధ్యాహ్న భోజన మెనూలో చేసిన మార్పుకు అనుగుణంగా తయారు చేయాలన్నారు. ఈ సమీక్షలో అడిషనల్ డైరెక్టర్ సత్యమూర్తి, ఆర్థిక, ఖాతాల విభాగాధికారులు భోజన్న, రాజు, బాలికల పరిరక్షణ అధికారి గౌసియా బేగం, ఎంఈఓలు తదితరులు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్ అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వైద్యధికారి మల్లికార్జునరావుతో కలిసి సీజనల్ వ్యాధులపై సమీక్షించారు. ప్రజలకు అంటువ్యాధులు రా కుండా దోమల నిర్మూలన లక్ష్యంగా పనిచేయాలన్నారు. మున్సిపాలిటీలు, జీపీల పరిధిలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టాలన్నారు.
అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్
మాట్లాడుతున్న అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్