
‘ఇందిర మహిళా శక్తి’తో స్వయం ఉపాధి
జనగామ: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో కల్యాణి స్వయం సహాయక సంఘ ప్రతినిధి మంజుల రూ.2లక్షల రుణంతో ఏర్పాటు చేసుకున్న వనిత టీ స్టాల్‌ను బుధవారం కలెక్టర్ ప్రారంభించారు. కలెక్టర్ స్వయంగా టీ తయారు చేసి అక్కడున్న వారికి అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి పథకంతో మహిళలకు ఆర్థిక భరోసా కలుగుతుందన్నారు. మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. వనిత టీ స్టాల్స్ ద్వారా రోజు రూ.3 వేల ఆదాయాన్ని మహిళలు పొందుతున్నారన్నారు. టీ స్టాల్‌లో కేవలం టీ అమ్మకం ఒక్కటే కాదని, డిమాండ్‌కు తగ్గట్టుగా చేతి ఉత్పత్తుల అమ్మకం, భోజనం, కస్టమర్లకు అవసరమైన వస్తువులు కూడా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ పీడీ వసంత, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని కలెక్టర్‌తో కలిసి టీ తాగారు.
వనిత టీ స్టాల్‌ను ప్రారంభించిన కలెక్టర్