
విద్యారంగ సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం
● ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు లవకుమార్
స్టేషన్‌ఘన్‌పూర్: విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు పొదల లవకుమార్ అన్నారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద బుధవారం ధర్నా, రాస్తారోకో చేపట్టారు. జిల్లా ఉపాధ్యక్షుడు యాకన్నరాథో డ్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో లవకుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.8,500 కోట్ల స్కాలర్‌షిప్స్, ఫీజు రీ యింబర్స్‌మెంట్స్ పెండింగ్‌లో ఉన్నాయన్నారు. బస్‌పాస్ చార్జీలు పెంచడంతో నిరుపేద కుటుంబా లకు చెందిన విద్యార్థులు చదువులకు దూరం కావాల్సిన దుస్థితి నెలకొందన్నారు. నాయకులు మనిత్‌రాజ్, రవళిక, ప్రకాష్, అభిషేక్, స్టాలిన్, వైష్ణవి, నందిని, కీర్తి, అంజలి పాల్గొన్నారు.