తల్లిపాలు బిడ్డకు అమృతం | - | Sakshi
Sakshi News home page

తల్లిపాలు బిడ్డకు అమృతం

Aug 6 2025 6:32 AM | Updated on Aug 8 2025 2:13 PM

జిల్లా వైద్యాధికారి మల్లికార్జునరావు

జనగామ: తల్లిపాలు బిడ్డకు అమృతంలాంటివని, సంపూర్ణ ఆరోగ్య ప్రదాయనిగా మేలు చేస్తాయని జిల్లా వైద్యాధికారి మల్లికార్జునరావు అన్నారు. మంగళవారం అర్బన్‌ పీహెచ్‌సీలో జరిగిన ఆశడే కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. గర్భిణులకు అందించే వైద్యసేవలను మరింత మెరుగుపరచాలన్నారు. తల్లులు తమ శిశువులకు తల్లిపాలు అందించాలనే విషయంపై అవగాహన కల్పించాలన్నారు. సీజనల్‌ వ్యాధులు, డెంగీ నివారణ, దోమలను నిర్మూలించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

విద్యార్థులకు ఏఐ కోర్సులో శిక్షణ

రఘునాథపల్లి: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ మద్రాస్‌ వారు స్కూల్‌ కనెక్ట్‌ ప్రోగ్రాంలో భాగంగా విద్యార్థులకు అందించే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) డేటా సైన్స్‌ ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సుకు మండలంలోని ఖిలా షాపూర్‌ ఉన్నత పాఠశాలకు చెందిన 10 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. మంగళవారం సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కేశిపెద్ది నర్సింహ్మరాజు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షురాలు లావణ్య, హెచ్‌ఎం భారత రవీందర్‌, ఉపాధ్యాయులు ఎంపికై న విద్యార్థులను అభినందించారు. అనంతరం హెచ్‌ఎం మాట్లాడుతూ రెండు నెలల కాలవ్యవధి గల ఈ కోర్సు విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధి, భవిష్యత్‌ ఉద్యోగ నియామకాలకు పునాదిగా దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కోర్స ఇన్‌చార్జ్‌ శ్రీనివాస్‌, శ్రీధర్‌, ఉపాధ్యాయులు ఉన్నారు.

విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదవాలి

కొడకండ్ల: విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదవాలని డైరెక్టర్‌ ఆఫ్‌ అడల్ట్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌, జిల్లా ప్రత్యేక అధికారి ఉషారాణి కోరారు. మంగళవారం మండలకేంద్రంలోని టీజీఆర్‌ఎస్‌ జేసీ గురుకులాన్ని సందర్శించి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉషారాణి మాట్లాడుతూ విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్‌ దనరాజు, డీఈఓ ఎఫ్‌ఏఓ భోజన్న, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ భాస్కర్‌, విజయ్‌కుమార్‌రెడ్డి, శంకర్‌రావు, శైలజ, ప్రిన్సిపాల్‌ దిలీప్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మార్పీకే విక్రయించాలి

దేవరుప్పుల: రైతులకు కావాల్సిన యూరియా, కాంప్లెక్స్‌ ఎరువులను ఎమ్మార్పీ ధరలకే అందుబాటులో ఉంచాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చందూనాయక్‌ అన్నారు. మంగళవారం మండలంలోని ధర్మాపురంలో జరిగిన మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రైతు వ్యతిరేక విద్యుత్‌ సవరణతో పాటు మార్కెట్‌ ముసాయిదా చట్టాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. జిల్లాలో 8వేల మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం ఉండగా కేవలం 6వేల మెట్రిక్‌ టన్నులు మాత్రమే సరఫరా చేశారన్నారు. 

దేవాదుల ప్రాజెక్ట్‌ ద్వారా గోదావరి జలాలను లిఫ్టింగ్‌ చేసి జిల్లాలోని చెరువులు నింపేందుకు సత్వర చర్యలు చేపట్టాలన్నారు. లేదంటే ఆందోళనలు చేస్తామన్నారు. అనంతరం ఆగ్రోస్‌ ఎదుట ఎమ్మార్పీకే యూరియా కావాలని ధర్నా చేయగా ఏఓ హామీ మేరకు విరమించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాపర్తి సోమయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సింగారపు రమేశ్‌, పయ్యావుల భిక్షపతి, కోటి, రామ్‌, రమేశ్‌, రాములు, సోమన్న లాలు, నరసింహ, మహేందర్‌, గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

తల్లిపాలు బిడ్డకు అమృతం1
1/2

తల్లిపాలు బిడ్డకు అమృతం

విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదవాలి2
2/2

విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement