
కాళేశ్వరంపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలి
● మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
జనగామ: తెలంగాణకు మణిహారంగా మారిన కాళేశ్వరంపై తప్పుడు ప్రచారాలు చేస్తే ప్రజలు తరిమికొట్టే పరిస్థితి ఉంటుందని, సీఎం రేవంత్‌రెడ్డి గాలి మోటార్లలో తిరుగుతూ గాలి ముచ్చట్లు చెప్పడానికి మాత్రమే మిగిలి పోయారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. మంగళవారం మాజీ మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్ బీఆర్‌ఎస్ కార్యాలయం నుంచి కాళేశ్వరంపై వీడియో ప్రజంటేషన్ నిర్వహించగా జిల్లా పార్టీ కార్యాలయంలో తాటికొండ రాజయ్య, పార్టీ కేడర్‌తో కలిసి వీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ పాలనను పక్కనబెట్టి కక్ష్య సాధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ముందు చూపుతో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇర్రి రమణారెడ్డి, పోకల జమున లింగయ్య, బాల్దె సిద్ధిలింగం, గాంధీనాయక్, పుస్కూరి శ్రీనివాస్, పెద్ది రాజిరెడ్డి, గద్దల నర్సింగారావు, పేర్ని స్వరూప, తదితరులు ఉన్నారు.
అసత్యాలను ప్రచారం చేస్తుంది..
జస్టిస్ ఘోష్ కమిటీ సమర్పించిన నివేదికను కాంగ్రెస్ ప్రభుత్వం అసత్యాలను ప్రచారం చేస్తుందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే స్వగృహంలో హరీశ్‌రావు వీడియో ప్రజంటేషన్‌ను వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టుపై ఎన్ని అసత్యాలు ప్రచారం చేసినా.. ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు.