
పరిసరాలను శుభ్రంగా ఉంచాలి
స్టేషన్‌ఘన్‌పూర్: పాఠశాలలు, హాస్టళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధి శివునిపల్లిలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో శానిటేషన్ నిర్వహణ, వంటగది, డైనింగ్ హాల్‌ను పరిశీలించారు. వంటలకు ఉపయోగించే ప్రతీ వస్తువు నాణ్యతతో ఉండాలని, తాజా కూరగాయలను మాత్రమే వాడాలని, మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని ఆదేశించారు. కంప్యూటర్ క్లాస్‌రూమ్‌ను పరిశీలించారు. అనంతరం పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ ఉత్తమ మార్కులు సాధించేలా కష్టపడి చదవాలన్నారు. అర్థంకాని పాఠ్యాంశాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలన్నారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించి ఓపీ, వైద్యులు, సిబ్బంది రిజిస్టర్లను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. నిత్యం వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. అలాగే స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాన్ని సందర్శించి యూరియా స్టాక్, యూరియా అందించే తీరును పరిశీలించారు. జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆయన వెంట ఆయా శాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు.
కలెక్టర్ రిజ్వాన్ బాషా