
మెరుగైన వైద్యసేవలందించాలి
జనగామ: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మెరుగైన వైద్యసేవలను అందించాలని సూపరింటెండెంట్ డాక్టర్ రాజలింగం అన్నారు. మంగళవారం ఆయన చాంబర్‌లో వైద్య సేవలపై అన్ని విభాగాల హెచ్‌ఓడీలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాజలింగం మాట్లాడుతూ రోగులకు మరింత నమ్మకం కలిగించేలా వైద్యులు, సిబ్బంది పని చేయాలన్నారు. జ్వరం, అనారోగ్య సమస్యలతో అడ్మిట్ అయ్యే రోగుల ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం కనిపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా జిల్లా ఆస్పత్రిలో మరో 70 నుంచి 80 బెడ్ల సామర్థ్యం పెంచేందుకు ఎదురుగా ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయాన్ని అద్దెకు తీసుకున్నారు. ఏఆర్‌టీ, బ్లడ్‌బ్యాంకు ఇతర సేవలను ఆ కార్యాలయంలోకి మార్చనున్నారు.
డీహెచ్ సూపరింటెండెంట్ రాజలింగం