
నాణ్యమైన ఆహారం అందించాలి
జఫర్‌గఢ్: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్య మైన భోజనం అందించాలని అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్ అన్నారు. మంగళవారం జఫర్‌గఢ్ మండలంలోని కేజీబీవీ, ఆదర్శ పాఠశాలను పరిశీలించారు. 3 విద్యాసంస్థలకు వెళ్లే దారి ఇ బ్బందికరంగా ఉండడాన్ని గుర్తించి, అంతర్గత రహదారుల నిర్మాణానికి తగిన ప్రతిపాదనలు ఇవ్వాలన్నారు. కేజీబీవీ హాస్టల్‌లోని వంట గది, స్టోర్ రూమ్‌ను పరిశీలించారు. కూరగాయలను పరిశీలించి ఎప్పటికప్పుడు తాజా కూరగాయాల ను తీసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్ వెంట అదనపు డైరెక్టర్ సత్యమూర్తి, జిల్లా బాలికల ప ర్యవేక్షక అధికారి గౌసియా బేగం, మండల వి ద్యాధికారి రఘునందన్ రెడ్డి, ఇంజనీర్లు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీకాంత్, ప్రత్యేక అధికారి స్వప్న, వార్డెన్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్