
ఇళ్లను కూలగొట్టిన వారిపై చర్య తీసుకోవాలి
జనగామ రూరల్: పేదల ఇళ్లను కూలగొట్టిన వా రిపై చర్యలు తీసుకోవాలని సీపీఎం పట్టణ కార్యదర్శి జోగు ప్రకాశ్, బొట్ల శేఖర్ డిమాండ్ చేశారు. సో మవారం పట్టణంలోని నెహ్రూ పార్క్ వద్ద సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం డీసీపీ రాజమహేంద్రనాయక్‌కు వినతి పత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణంలో 400 సర్వేనంబర్‌లో 20 సంవత్సరాల క్రితం ఆటో, హమాలీ కార్మికులు, ఒంటరి మహిళలు కొనుగోలు చేసుకుని ఇల్లు నిర్మించుకున్నారన్నారు. సోమవారం ఓ వ్యక్తి ఆ భూమితో ఎ లాంటి సంబంధం లేకపోయినా దౌర్జన్యంగా ఇళ్లను కూలగొట్టారన్నారు. తక్షణమే కేసు నమోదు చేసి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి, పల్లెల లలిత, ధర్మ భిక్షం, అజ్మీరా సురేష్ నాయక్, కనకాచారి, శివ, సమ్మయ్య, గాజుల నాగరాజు, గట్టయ్య, బండ్రు సత్తయ్య, మంజుల లక్ష్మి, ప్రసాద్, పరశురాములు, నాగరాజు, గంగరబోయిన మల్లేష్‌రాజ్, సుమ, తదితరులు పాల్గొన్నారు.