
ప్రతిఒక్కరూ పరిశుభ్రత పాటించాలి
జనగామ: వ్యాపారులు ఖచ్చితంగా పరిశుభ్రతను పాటించాలని జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి కృష్ణమూర్తి అన్నారు. సోమవారం పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వీధి వ్యాపారులు పరిశుభ్రత, భద్రతా ప్రమాణాలు, వ్యాధుల నివారణ మార్గాలు, ఆహార నిల్వ, వంట విధానం, ప్లాస్టిక్ నివారణపై పలు సూచనలు ఇచ్చారు. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్ట్రీట్ వెండర్స్ ఆఫ్ ఇండియా, మోప్మా, మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వ్యాపారులకు శిక్షణ నిర్వహించారు. అనంతరం శిక్షణలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్‌తో పాటు సేఫ్టీ కిట్ అందించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఏఎస్‌వీఐ రాష్ట్ర అధ్యక్షుడు రంగ శాలివాన్, సేఫ్టీ ఇండియా స్టేట్ మేనేజర్ వసీం అహ్మద్, మోప్మా ప్రాజెక్టు డైరెక్టర్ హర్షవర్థన్, అధికారులు వినీల్‌కుమార్, రమేశ్‌నాయక్, వాణిశ్రీ, షాహిన్ సుల్తానా, తిరుమల, గురునాఽథ్, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి కృష్ణమూర్తి