
జనగామ
మంగళవారం శ్రీ 5 శ్రీ ఆగస్టు శ్రీ 2025
సమస్యలు పరిష్కరించరూ..
ముగిసిన రాష్ట్రస్థాయి
అథ్లెటిక్స్ పోటీలు
హనుమకొండ జేఎన్‌ఎస్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలు సోమవారం ముగిశాయి.
జనగామ రూరల్: ఉండటానికి ఇల్లు లేదని, తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, వితంతు పింఛన్, ఇంటి నంబర్ తప్పు పడిందని, భూమి ఆక్రమించుకోవాలని చూస్తున్నారని.. ఇలా పలు సమస్యలతో సోమవారం బాధితులు గ్రీవెన్స్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్లు పింకేష్‌కుమార్, రోహిత్‌సింగ్‌లు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు అధికారులు తక్షణమే పరిష్కరించాలన్నారు. పెండింగ్ సమస్యలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలన్నారు. గ్రీవెన్స్‌లో మొత్తం 81 వినతులు రాగా ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు.
వినతులు కొన్ని ఇలా..
● బచ్చన్నపేట గ్రామానికి చెందిన చల్లా వసంత ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు.
● లింగాలఘణపురం మండలం నెల్లుట్లకు చెందిన సంభోజు నరసింహస్వామికి చెందిన భూమిని కొంతమంది అక్రమంగా పట్టా చేయించుకున్నారని, విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందించారు.
● జనగామ పట్టణంలోని సాయినగర్‌కు చెందిన బంధారపు లక్ష్మయ్య మిషన్ భగీరథ కనెక్షన్ ఇప్పించాలని కోరారు.
భూమి కబ్జా చేయాలని
చూస్తున్నారు..
మల్కాపురం గ్రామంలో 333/ఇ1, 333/ఇ2 సర్వే నంబర్లలోని ఎకరం భూమిని గత కొన్ని ఏళ్ల నుంచి సాగు చేసుకుంటా. గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు అక్రమంగా మార్పిడి చేసి పదేళ్ల నుంచి రైతు పెట్టుబడి సాయం అందకుండా చేశారు. విచారణ చేపట్టి సదరు వ్యక్తులపై చర్య తీసుకొని న్యాయం చేయాలి.
– బిల్లా మల్లారెడ్డి,
మల్కాపురం, చిల్పూర్
భూమి పట్టా చేయడం లేదు..
గ్రామంలో తన తండ్రి మనోహర్ పేరు మీద సర్వే నంబర్ 362సీలో 14 గుంటల భూమి ఉంది. ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో తండ్రి మరణించారు. వారసత్వంగా వస్తున్న భూమి పట్టా చేయాలని స్లాట్ బుక్ చేయగా ఏడాది అవుతున్న పట్టా కావడం లేదు. భూమి పట్టా అయ్యేటట్లు చూడాలి
– దుక్కిడి కృష్ణ,
ఇబ్రహీంపూర్,రఘునాథపల్లి
పై ఫొటోలోని వ్యక్తులు రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ గ్రామానికి చెందిన వారు. స్థానిక ఎస్‌బీఐ వద్ద వీధిదీపాలు లేకపోవడంతో గ్రామంలోని మహిళలు, ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. రాత్రి వేళల్లో విషపురుగులతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తక్షణమే వీధిదీపాలు ఏర్పాటు చేయించాలని గ్రామానికి చెందిన బానోత్ జితేందర్‌తో పాటు మరికొందరు కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు.
ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయలేదు
కూలీ పనులు చేసుకుంటున్న తమకు మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయలేదు. గ్రామంలో ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నాం. ప్రభుత్వం తక్షణమే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి.
–పోతుగంటి జ్యోతి, అలీంపూర్, బచ్చన్నపేట
ఒంటరి మహిళా పింఛన్ ఇప్పించరూ..
భర్త అనివార్య కారణాలతో నన్ను విడిచిపెట్టారు. ఇద్దరు పిల్లలను కూలీ పనులు చేసుకుంటూ పోషించుకుంటున్న. ఒంటరి మహిళ కింద పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలి.
– జేరుపోతుల ప్రసన్న,
ఓబుల్ కేశవాపూర్, జనగామ
న్యూస్‌రీల్
కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు
చేస్తున్న బాధితులు
పెండింగ్ దరఖాస్తులు త్వరగా
పరిష్కరించాలి
కలెక్టర్ రిజ్వాన్ బాషా
ప్రజావాణికి 81 వినతులు
ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్
సమస్యలే ఎక్కువ

జనగామ

జనగామ

జనగామ

జనగామ

జనగామ

జనగామ

జనగామ

జనగామ