
విద్యారంగానికి అధిక ప్రాధాన్యం
జనగామ రూరల్: ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్‌తో కలిసి స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని రెసిడెన్షియల్ విద్యాసంస్థల ప్రిన్సిపాల్, స్పెషల్ ఆఫీసర్లతో విద్యాప్రగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రెసిడెన్షియల్ పాఠశాలలకు మిషన్ భగీరథ నీటిని సరఫరా చేయాలని, తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. ఈ సమావేశంలో హనుమకొండ డీఈఓ వాసంతి, ఎంఈఓలు, స్పెషల్ ఆఫీసర్లు, ప్రిన్సిపాల్స్, అధికారులు పాల్గొన్నారు.
నీటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి
నీటి నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రిజ్వాన్ బాషాతో కలిసి నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికి దేవాదుల నీటి ద్వారా జిల్లాలోని పంట పొలాలను కాపాడుకునే అవకాశం ఉందన్నారు. పొలాలు ఎండిపోకుండా నీటిని సర్దుబాటు చేయాలని, వర్షపాతం తక్కువగా నమోదైనందున నీరు వృథా కాకుండా పంటలకు అందించే బాధ్యత అధికారులదేనన్నారు. జనగామ, హనుమకొండ జిల్లాల నీటిపారుదల శాఖ ఎస్సీలు సుధీర్, వెంకటేశ్వర్లు డిప్యూటీ కలెక్టర్ సుహాసిని జనగామ, స్టేషన్ ఘనపూర్ ఆర్డీఓలు గోపిరామ్, వెంకన్న, అధికారులు, రైతులు, పాల్గొన్నారు.
నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి
స్టేషన్‌ఘన్‌పూర్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సోమవారం డివిజన్ కేంద్రంలోని తహసీ ల్దార్ కార్యాలయ ఆవరణలో నిర్మాణం పూర్తయిన మోడల్ ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లు పూర్తయిన లబ్ధిదారులకు బిల్లులు త్వరగా చె ల్లించేలా చూడాలని, ఇప్పటి వరకు నిర్మాణాలు మొదలు పెట్టని వారిని గుర్తించి పనులు ప్రారంభించేలా చూడాలన్నారు. ఆర్డీఓ వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ లావణ్య పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి
విద్యాప్రగతిపై సమీక్ష

విద్యారంగానికి అధిక ప్రాధాన్యం