
సిద్ధేశ్వరాలయంలో శ్రావణ పూజలు
బచ్చన్నపేట: శ్రావణ మాసం రెండో సోమవారం సందర్భంగా మండలంలోని కొడవటూర్ గ్రామం సిద్ధేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు కావడంతో అన్ని శివాలయాల్లో భక్తుల సందడి నెలకొంది. చిన్నరామన్ పల్లిలోని స్వయంభూ రామలింగేశ్వరాలయం, బండనాగారం, కొన్నెలోని శివ లింగాలను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. ఆలయాలకు వచ్చిన భక్తులకు ఆలయ సిబ్బంది అన్ని సౌకర్యాలు కల్పించారు. ఈ కార్యక్రమంలో ఈఓ చిందం వంశీ, ఆలయ ప్రధాన పూజారి ఓంనమశివాయ, సిబ్బంది నూకల లక్ష్మికాంత్‌రెడ్డి, గంగం భానుప్రకాష్‌రెడ్డి, బండారి శ్రీనివాస్, భక్తులు పాల్గొన్నారు.
వేయిస్తంభాల దేవాలయంలో...
హన్మకొండ కల్చరల్ : వేయిస్తంభాల దేవాలయంలో శ్రావణమాసంలోని ద్వితీయ సోమవారాన్ని పురస్కరించుకుని శ్రీరుద్రేశ్వరస్వామి వారికి ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 100 మంది భక్తులు సామూహిక రుద్రాభిషేకాలు జరుపుకున్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, నీలిమ దంపతులు దేవాలయాన్ని సందర్శించి రుద్రాభిషేకం జరిపించారు. మధ్యాహ్నం దేవాదాయశాఖ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. ఈఓ అనిల్‌కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

సిద్ధేశ్వరాలయంలో శ్రావణ పూజలు