
విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌కు కృషి
జనగామ రూరల్: విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌కు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్ అన్నారు. సోమవారం పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను కలెక్టర్ రిజ్వాన్ బాషా, సంబంధిత అధికారులతో కలిసి సందర్శించారు. విద్యార్థులు పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వన మహోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టర్‌తో కలిసి మొక్కలు నాటారు. పాఠశాలలోని స్టాక్ రూమును సందర్శించి విద్యార్థుల భోజనం కొరకు వినియోగిస్తున్న వంట సామగ్రిని, వండిన ఆహార పదార్థాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా?లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత చదువులు చదవాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రావు, జిల్లా బాలికల పర్యవేక్షణ అధికారి గౌసియా బేగం, సివిల్ సప్లయీస్ డీటీలు శ్రీనివా స్, లచ్చు నాయక్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్
సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్
పాఠశాల సందర్శన