
పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దాం
జగనామ: హిందువులు, ప్రకృతి ఆరాధకులు ప్రాణాధార, ఔషధ మొక్కలను పెంచి పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దామని వీహెచ్‌పీ జిల్లా కార్యదర్శి మోహనకృష్ణ భార్గవ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని సీతారామచంద్రస్వామి దేవస్థానంలో విశ్వహిందూ పరిషత్, దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం వన మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దైవిక మొక్కలు నాటి హరిత సంకల్పాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటి వృక్ష సంపదను పెంపొందించడంతో పాటు పర్యావరణ సమతుత్యతను కాపాడాలన్నారు. ఆలయ గౌరవ అధ్యక్షుడు గజ్జెల నర్సిరెడ్డి మాట్లాడుతూ ప్రతిఒక్కరు ఒక మొక్క నాటి సంరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాశం శ్రీశైలం, గోవర్ధన్, యాదగిరి, హనుమారెడ్డి, అనిల్, సాయిసుజీత్, నాగమణి, జక్క జ్యోతి, ధనలక్ష్మి, రేణుక తదితరులు పాల్గొన్నారు.
వీహెచ్‌పీ జిల్లా కార్యదర్శి
మోహనకృష్ణ భార్గవ