
కాంప్లెక్స్ ఎరువులనే వాడాలి
పాలకుర్తి టౌన్: యూరియాకు బదులు కాంప్లెక్స్ ఎరువులను వాడేవిధంగా రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయశాఖ జిల్లా అధికారి కట్ట అంబికాసోని అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంప్లెక్స్ ఎరువులు వాడి నేల సారవంతాన్ని పెంపొందించుకోవాలన్నారు. షాపు యజమానులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. స్టాక్ బోర్డులు ప్రదర్శించాలన్నారు. మండల పరిధిలోని షాపుల్లో నిరంతరం తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్‌చార్జి వ్యవసాయ అధికారి విజయ్‌రెడ్డి, ఏఈఓలు సంకటబోయిన మహేష్, ముత్తినేని వెంకటేష్, మాన్యపు దీపక్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వ్యవసాయశాఖ అధికారి
అంబికాసోని