
నాణ్యమైన విద్యుత్ అందించాలి
జనగామ: జిల్లాలో ట్రాన్స్‌ఫార్మర్ల ఫెల్యూర్స్‌ను తగ్గించి నాణ్యమైన విద్యుత్‌ను అందించాలని ఎన్‌పీడీసీఎల్ ఆపరేషన్ డైరెక్టర్ మధుసూదన్ అన్నారు. సోమవారం సర్కిల్ కార్యాలయంలో గత నెలలో జరిగిన పనులు, టార్గెట్, ప్రస్తుత మాసంలో చేయాల్సిన పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తరచూ జరిగే ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. 33 ఇంటర్ లింకింగ్ లైన్ పూర్తి చేయడంతో పాటు వ్యవసాయ సర్వీస్‌లను వెంటనే రిలీజ్ చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో చీఫ్ ఇంజనీర్ రాజ చౌహన్, సూపరింటెండెంట్ ఇంజనీర్ వేణుమాధవ్, డీఈ టె క్నికల్ గణేష్, ఎస్‌ఏఓ జయరాజు, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ డీఈ లక్ష్మీనారాయణరెడ్డి, రాంబాబు, విజయకుమార్, ఏడీ, ఏఈలు పాల్గొన్నారు.
ఎన్‌పీడీసీఎల్ ఆపరేషన్ డైరెక్టర్
మధుసూదన్