రుద్రేశ్వరుడిని దర్శించుకున్న రాష్ట్ర జైళ్ల శాఖ డీజీపీ | - | Sakshi
Sakshi News home page

రుద్రేశ్వరుడిని దర్శించుకున్న రాష్ట్ర జైళ్ల శాఖ డీజీపీ

Aug 4 2025 3:55 AM | Updated on Aug 4 2025 3:55 AM

రుద్రేశ్వరుడిని దర్శించుకున్న రాష్ట్ర జైళ్ల శాఖ డీజీపీ

రుద్రేశ్వరుడిని దర్శించుకున్న రాష్ట్ర జైళ్ల శాఖ డీజీపీ

హన్మకొండ కల్చరల్‌: వేయిస్తంభాల ఆలయాన్ని తెలంగాణ జైళ్ల శాఖ డీజీపీ సౌమ్యమిశ్రా ఆదివారం సందర్శించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, అర్చకులు మంగళవాయిద్యాలతో ఘ నంగా స్వాగతించారు. డీజీపీ సౌమ్యమిశ్రా ముందుగా ఉత్తిష్ట గణపతిని దర్శించుకుని రుద్రేశ్వరస్వామికి లఘన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించుకున్నారు. అనంతరం ఆలయ నాట్య మండపంలో ఉపేంద్రశర్మ తీర్థ ప్రసాదాలు, శేష వ స్త్రాలు, మహదాశీర్వచనం అందించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను వరంగల్‌ జిల్లాలో పనిచేసినప్పుడు చాలా సార్లు వేయిస్తంభాల ఆలయాన్ని సందర్శించినట్లు తెలిపారు. స్వామి వారిని దర్శించుకుంటే కొంత మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ఆలయ ఈఓ అనిల్‌కుమార్‌ ఏ ర్పాట్లు పర్యవేక్షించారు. ఆమె వెంట వరంగల్‌ ఏసీపీ నాగరాలె శుభం ప్రకాశ్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement