
సుందరీకరణ పనులు పరిశీలన
జనగామ: జనగామ రైల్వేస్టేషన్‌లో అమృత్ భారత్ పథకంలో కొనసాగుతున్న సుందరీకరణ పనులను దక్షిణ మధ్య రైల్వే డీఆర్‌ఎం గోపాలకృష్ణన్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. శ్రీనత్తే నయంశ్రీ శీర్షికన సాక్షిలో గత నెలలో ప్రచురితమైన కథనానికి డీఆర్‌ఎం స్పందించారు. పనుల్లో నాణ్యత పాటించి, మరింత వేగం పెంచాలని ఆదేశించారు. స్టేషన్ ముఖద్వారంతో పాటు ప్లాట్ ఫాంలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, డివైడర్లు, ఇతర పనులను పరిశీలించారు. కాగా జనగామ స్టేషన్‌లో దానాపూర్, చార్మినార్, షిర్డీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపే విధంగా చూడాలని కోరుతూ నాయకులు ఈగం శ్రీనివాస్, బింగిరాజు, కె.యాదగిరి, చెన్నోజు నగేష్ కుమార్, కొమురయ్య, సోమ శేఖర్, వెంకటేశ్వర్లు తదితరులు డీఆర్‌ఎంకు వినతి పత్రం అందించారు.

సుందరీకరణ పనులు పరిశీలన