
ప్రత్యేక అలంకరణలో అమ్మవారు
జనగామ: జనగామ పట్టణం రైల్వేస్టేషన్ అమ్మబావి సమీపంలోని ఉప్పలమ్మ తల్లి శ్రావణమాసం రెండవ ఆదివారం ప్రత్యేక చీరల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన పూజారి వారనాసి పవన్‌శర్మ మంత్రోచ్ఛరణల నడుమ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
7న రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలు
జనగామ: జిల్లా కేంద్రం ధర్మకంచ మినీ స్టేడియంలో ఈ నెల 7న జరగనున్న రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు హాజరు కావాలని కోరుతూ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్‌కు ఆదివారం అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెద్ది వెంకటనారాయణగౌడ్ ఆహ్వా న పత్రిక అందించారు. ఆయన వెంట అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి మనోజ్ కుమార్, కోశాధికారి ఆవుల అశోక్, గాదె శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
అంబేడ్కర్ సేవారత్న
అవార్డు ప్రదానం
స్టేషన్‌ఘన్‌పూర్: విద్యుత్‌శాఖలో స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లి లైన్‌మన్‌గా పనిచేస్తున్న గబ్బెట సుధాకర్ ఆదివారం అంబేడ్కర్ సేవారత్న అవార్డును అందుకున్నారు. విద్యుత్‌శాఖలో విధుల్లో చురుకుగా పనిచేస్తూనే పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్న సుధాకర్ సేవలను గుర్తించి లలిత కళా సమాఖ్య సేవా సామాజిక సంస్థ వారు అంబేడ్కర్ సేవారత్న అవార్డుకు ఎంపిక చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభ వేదికపై సుధాకర్‌కు అవార్డును అందించారు. అవార్డుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ సుధాకర్ కృతజ్ఞతలు తెలిపారు.
టీటీసీ పరీక్షలకు
99.11 శాతం హాజరు
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు ఆదివా రం మూడు సెషన్లలో నిర్వహించారు. ప్రభు త్వ ప్రాక్టీసింగ్ హైస్కూల్, లష్కర్‌బజార్ బాలి కల ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పెట్రోల్‌బంక్ ప్రభుత్వ హైస్కూల్ పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు పరీక్షలు జరిగాయి. 566 మంది అభ్యర్థులకుగాను 560 మంది 99.11 శాతం హాజరైనట్లు జిల్లా విద్యాశాఖలోని ఏసీజీఈ బి.భువనేశ్వరి తెలిపారు.

ప్రత్యేక అలంకరణలో అమ్మవారు