స్టేషన్‌ఘన్‌పూర్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌పై ప్రజలను తప్పుదోవ పట్టించేలా బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు నాటకాలు ఆడుతున్నారని ఎమ్మెల్యే కడి యం శ్రీహరి మండిపడ్డారు. నియోజకవర్గంలోని ఏడు మండలాలు, స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీకి చెందిన కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు, పార్టీ ముఖ్యనాయకుల సమావేశాన్ని డివిజన్ కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కడియం హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్‌పై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే దానికి చట్టబద్దత కల్పించకుండా ప్రజలను మభ్యపెట్టడానికి నాటకాలు ఆడుతున్నారన్నారు. అలాగే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో స్పీకర్ నిర్ణయంపై ఇప్పుడే స్పందించాల్సిన అవసరం లేదని, ముందుగా పార్టీ శ్రేణులు సమష్టిగా స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించాలన్నారు. అనంతరం వివిధ గ్రామాలకు చెందిన 105 మంది లబ్ధిదారులకు రూ.41.89లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కాగా పార్టీ నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో పార్టీ నాయకులెవరూ కండువాలు ధరించకుండా రావడం విశేషం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ జూలుకుంట్ల లావణ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం.రాంబాబు, చి ల్పూరు దేవస్థాన చైర్మన్ శ్రీధర్‌రావు, రైస్‌మిల్లర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బెలిదె వెంకన్న, నా యకులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి