
ప్రభుత్వాలు మారినా.. ప్రజల బతుకులు మారలె
బచ్చన్నపేట: రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా ప్రజ ల బతుకుల్లో మార్పు రాలేదని మాజీ మంత్రి గుండె విజయరామారావు అన్నారు. ఆదివారం మండలంలోని దబ్బగుంటపల్లి గ్రామంలో బీజేపీ పార్టీ చే పడుతున్న మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు బంగారు మహేష్ అధ్యక్షతన ఇంటింటికి బీజేపీ ప్రతి ఇంటికి పోలింగ్ కార్యక్రమం నిర్వహించారు. నరేంద్రమోదీ 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించిందని, బీఆర్‌ఎస్ పార్టీ చేసిన ఆరాచక పాలనను ఈ ప్రభుత్వం కూ డా కొనసాగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్, నాయకులు శశిధర్‌రెడ్డి, స ద్ది సోమిరెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి, నవీన్‌రెడ్డి, ఉమరవి, గద్ద రాజు, జలేందర్, చక్రపాణి, రమేష్, కనకారెడ్డి, రమేశ్, నవీన్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి విజయరామారావు